17.9.06

సాహసం నా పదం

చిత్రం: మహార్షి
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: బాలు


సాహసం నా పదం రాజసం నా రధం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చెయదా వూడిగం
శాసనం దాటడం శఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటన
ఈ పిడికిలిలో తానొదుగునుగా
సాహసం నా పదం రాజసం నా రదం
సాగితే ఆపడం సాధ్యమా


నిశ్చయం, నిశ్చలం. హహహా.
నిర్భయం నా హయం

కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా
తప్పని ఒప్పని తర్కమే చేయను.
కష్టమో నష్టమో లెక్కలే వేయను
ఉరుకుంటే కాలమంతా జారిపోదా ఊహవెంట
నే మనస్సు పడితే ఏ కలలైనా
ఈ చిటికకోడుతు నే పిలువనా

సాహసం నా పదం రాజసం నా రధం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా

అదరని బెదరని ప్రవృత్తి
ఒదగని మదగజమే మహార్షి

వేడితేనేని ఓడిచేరుతందా వేటసాగాలి కాదా
ఓడితే జాలి చూపేన కాలం కాలరాసేసి పోదా
అంతమో సోంతమో పంతమే వీడను.
మందలో పందలా ఉండనే ఉండను
భీరువల్లే పారిపోను రేయి ఓళ్ళోతూలిపోను
నే మొదలు పెడితే ఏ సమరమైనా నాకెదురుపడునా ఏ అపజయం

సాహసం నా పదం రాజసం నా రధం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చెయదా వూడిగం
శాసనం దాటడం శఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటన
ఈ పిడికిలిలో తానొదుగునుగా

సాహసం నా పదం రాజసం నా రధం సాగితే ఆపడం సాధ్యమా

తకిటజం తరితజం తనతజం జమ్తజం తకిటజం తరితజం జమ్తజం


ఈ పాట సాహిత్యాన్ని నాకు అందజేసినవారు కృష్ణ వేదుల (జి మెయిల్: krishvedula)

1 comment:

Anonymous said...

రెండు కరెక్షన్స్...
రచన వేటూరి కానే కాదు. ఇది ఈ సినిమాలోని ఒకే ఒక 'సిరివెన్నెల' పాట.

ఇక మొదటి లైన్లో 'సాహసం నా పదం' కాదు, 'సాహసం నా పథం'. పథం అంటే దారి.