28.8.05

నేనున్నానని..

చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

తగిలే రాళ్ళని పునాది చేసి యదగాలని
తరిమే వాళ్ళని హితులుగ తలచి ముందుకెళ్ళాలని
కన్నుల నీటిని కలలు సాగుకై వాడుకోవాలని
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని
గుండేతో ధైర్యం చెప్పెను
చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని..

యెవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని
అందరు ఉన్నా ఆప్తుడు నువ్వై చేరువయ్యావని
జన్మకు యెరుగని అనురాగాన్ని పంచుతున్నావని
జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని
శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

Source: http://www.telugubiz.net/lyrics/nenunnaanu2.html

20.8.05

చెలికాడు నిన్నే రమ్మని పిలువా

చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
నన్నే తెలుపమంటావా
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా

నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ
నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
అహహా ...అహా ఒహోహో ....
అహహా ఒహో ......అ ఆ
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా

నీ అందమే శ్రీగంధమై నా డెందమలరించే
నీ రూపె దీపమ్మై ప్రియా నా చూపుల వెలిగించే
అహహా ... అహా ఒహోహో .....
అహహా ఒహో.......అ ఆ ...
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా

నీతోడుగా నడయాడగా ఇంకేమి కావాలీ
మధురానురాగాలే ఫలించే తరుణం రావాలీ
అహహా...అహా ఒహోహో....
హహా ఒహో...అ ఆ . .
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
నన్నే తెలుపమంటావా

Source: http://www.telugubiz.net/lyrics/kulagotralu3.html

19.6.05

మధురమే

మధురమె మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తె మధురమే ఆ
నన్నె తడిపేస్తె మధురమే మధురమే

నీకోసం నే రాసే చిరు పాటైన మధురమే
నాకోసం నువ్వు పలికే అరమాటైన మధురమే
నీకోసం నే రాసే చిరు పాటైన మధురమే
నాకోసం నువ్వు పలికే అరమాటైన మధురమేి
లిపిలేని సడి లేని ఆ కన్నుల భాష మధురమే
హృదయాన్ని మురిపించె ఆ సాగర ఘోష మధురమే
మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే
ఉంటె నువ్వుంటె ఆ శూన్యం అయినా మధురమే మధురమే మధురమే

సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమే
సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమే
ఉదయాన ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమే
రేయంత వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే
చెక్కిలి నెరుపు మధురమే
చెలి కాటుక నలుపు మధురమే
రాల్చె కన్ను రాల్చె ఆ కన్నీరైన మధురమే మధురమే మధురమే

http://www.telugubiz.net/lyrics/satyam1.html

16.6.05

వెన్నెల్లో గోదారి

వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం ||వెన్నెల్లో గోదారి||

అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై
నాలో సాగే మౌనగీతం ||వెన్నెల్లో గోదారి ||

జీవిత వాహిని అలలై ... జీవిత వాహిని అలలై
ఊహకు ఊపిరి వలలై బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో..
ఎడబాటే.. ఒక పాటై పూలదీవిలో సుమవీణ మోగునా ||వెన్నెల్లో గోదారి||

నిన్నటి శర పంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి..
కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నాచూపులు చూడలేని మంచు బొమ్మనై..
యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్ని చిదిమి చిదిమి
వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే..

నాకు లేదు మమకారం.. మనసు మీద అధికారం ..
నాకు లేదు మమకారం.. మనసు మీద అధికారం ..
ఆశలు మాసిన వేసవిలో... ఆవేదనలో రేగిన ఆలాపన సాగే ..
మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే మనసు వయసు కరిగే
మధించిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో ..
తిరిగే.. సుడులై .. ఎగసే ముగిసే కదనేనా .. ఎగసే ముగిసే కదనేనా..

చిత్రం: సితార

17.5.05

రాళ్ళళ్ళో ఇసకల్లో..

రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో

కలలన్ని పంటలై పండెనేమో
కలిసింది కన్నుల పండగేమో
చిననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగ బంధమేమో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
యెన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో
యెన్నెన్ని భావాలో ఑఑ ఑఑఑఑ ఑౉||రాళ్ళళ్ళో ||

చూసాను యెన్నడో పరికిణిలో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచిన వన్నెలేవో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహం లో
ఆ మోహా దాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో
యెన్నెన్ని కౌగిళ్ళో.. ఑౉||రాళ్ళళ్ళో ||

14.4.05

అలనాటి రామ చంద్రుడి..

అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి || అలనాటి ||
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి

తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీ హరి ఇంటి దీపమల్లె కనిపించిన జాన ||తెలుగింటి||
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి

చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీద నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మ వెన్నేలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా

పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపిన తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయానా ॥ అందాల ॥
కలలకు దొరకని కళగల జంటను పదిమందీ చూడంది
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి ॥చందమామ॥

సీతారాముల కల్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపాన
గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా
మరగలేదు మన్మధుని వొళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైన ఇంత ఘనంగా జరిగేనా ॥ దేవుళ్ళ ॥
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి ॥చందమామ॥

http://www.telugubiz.net/lyrics/muraari1.html

21.3.05

పుణ్యభూమి నాదేశం

పుణ్యభూమి నాదేశం నమో నమామి..
ధన్యభూమి నాదేశం సదా స్మరామి. ॥పుణ్యభూమి॥

నన్ను కన్న నాదేశం నమో నమామి..
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి
మహామహుల కన్న తల్లి నా దేశం
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం ....నా దేశం..... ॥పుణ్యభూమి॥

అదిగో ఛత్రపతి.. ద్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు ఝలిపిస్తే
మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి
మాతృభూమి నుదిటి పై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు... సార్వ భౌముడు...

అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన
అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ॥అడుగో॥
ఒరేయ్‌ ఎందుకు కట్టాలిరా శిస్తు,
నారు పోసావా.... నీరు పెట్టావా ....
కోత కోసావా .... కుప్పనూర్చావా....
ఒరేయ్ తెల్ల కుక్క
కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలి రా...
అని పెళ పెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి
ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు
కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు ॥పుణ్యభూమి॥ ॥నన్ను కన్న ॥

అదిగదిగో...అదిగదిగో... ఆకాశం భల్లున తెల్లారి
వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి అగ్గి పిడుగు అల్లూరి
ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు
ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్లదొరగాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి భానిసలుగా మమ్మునెంచి
పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా
బడుగు జీవులు బగ్గు మంటే.. ఉడుకు నెత్తురు ఉప్పెనైతె
ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా
అన్న ఆ మన్నెందొర అల్లూరిని చుట్టి ముట్టి
మందీ మార్బలమెట్టి మరఫిరంగులెక్కిపెట్టి
వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే
వందే మాతరం వందే మాతరం వందే మాతరం
వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం

అజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి
అఖండ భరత జాతి కన్న మరో శివాజి
సాయుద సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర్య భారతావని మన స్వర్గమని
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని
హిందు ఫౌజు జైహింద్ అని నడిపాడు.
గగన శిగలకెగసి కనుమరుగై పోయాడు
జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్
జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్

గాంధీజి కలలు కన్న స్వరాజ్యం
సాధించే సమరం లో అమర జ్యోతులై వెలిగే
ధ్రువ తారల కన్నది ఈ దేశం
చరితార్ధుల కన్నది నా భారతదేశం నా దేశం ॥పుణ్యభూమి॥ ॥నన్ను కన్న ॥

http://www.telugubiz.net/lyrics/majorchandrakant1.html

14.3.05

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం

గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి
యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం

పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం

http://www.telugubiz.net/lyrics/gayam2.html

జగమంత కుటుంభం నాది..

పల్లవి
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం సూన్యం నావే
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

చరణం 1
కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలొ కన్నీటి జలపాతాల
నాతో నేను సంగమిస్తు నాతో నేనె భ్రమిస్తు
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్నీ రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

చరణం 2

మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై

మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై

మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిసినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

చరణం 3

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

http://www.telugubiz.net/lyrics/chakram1.html

4.3.05

సాపాటు యెటూలేదు

హే హే హే హే హే హే హేఐహే.. రు రు రు రు రు రూ రు రూ..
సాపాటు యెటూలేదు పాటైనా పాడు బ్రదర్‌
సాపాటు యెటూలేదు పాటైనా పాడు బ్రదర్‌
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్‌
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్‌

సాపాటు||

మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా ||మన||
డిగ్రీలు తెచ్చుకొని చిప్పచేత పుచ్చుకొని ఢిల్లికి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే బావి పౌరులం బ్రదర్‌

సాపాటు||

బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుతామురా ఇంట్లో ఈగల్ని తోలుతామురా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషయం కట్టెయ్‌ బ్రదర్‌

సాపాటు||

సంతాన మూలికలం సంసార బానిసలం
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా
చదవెయ్య సీటులేదు చదివొస్తే పనీలేదు
అన్నమో రామచంద్రా అంటే పెట్టేదిక్కేలేదు
దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్‌

సాపాటు||

http://www.telugubiz.net/lyrics/akalirajyam1.html

2.3.05

నల్లా నల్లాని కళ్ళ

పల్లవి
నల్లా నల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యే
వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్ని వెతికి వాణ్ణెల్లాగోలాగ
తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా

చరణం 1
ఎర్రంగా బొద్దుగా ఉంటే చాలా
వొళ్ళోపెట్టుకు లాలి పాడి జోకొట్టాలా
అడుగులకే మడుగులు ఒత్తే వాడే మేలా
మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా
ఉప్పుల గుప్పా వయ్యారి భామా
ముద్దుల గుమ్మ చెప్పవె బొమ్మా

ఉప్పుల గుప్పకి వయ్యారి భామకి
నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా
ఆహ్‌ నేనా నీతో సరిపోతానా

నల్లా నల్లాని కళ్ళ పిల్లాడా నువ్వుపెళ్ళాడేది
ఎల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మ
తెల్లారెసరికల్లా నే జిల్లాలన్ని వెతికి దాన్ని
ఎల్లాగోలగ తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా

చరణం 2
మెత్తంగా పువ్వులా ఉంటే చాలా
మొత్తంగా తానే చేసుకు పోతుండాలా
కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా
సై అంటే సై అని బరిలో దూకెయ్యాలా
కాళ్ళా గజ్జ కంకాళమ్మా ఎవరోయమ్మ కుజురాహో బొమ్మా

ఇంకెందుకులే దాపరికమ్మ నచ్చిన పిల్లవు నువ్వేనమా

చీ నేనా నీతో సరిపోతానా

సిగ్గుల మొగ్గల బూరెల బుగ్గల
నల్లా నల్లాని కళ్ళ పిల్లా నిను పెళ్ళాడే వాడ్నిలా
ఊరించి ఉడికించొద్దమ్మ
తెల్లారెసరికల్లా మనమెల్లాగోలాగ
మొగుడుపెళ్ళాలైపోయేదారి కాస్త చూపించేయమ్మ

http://www.telugubiz.net/lyrics/sye5.html

18.2.05

రావోయి చందమామ..

పల్లవి
రావోయి చందమామ మా వింత గాద వినుమా
రావోయి చందమామ మా వింత గాద వినుమా
సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్‌
సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్‌
సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే

చరణం 1
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్‌
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్‌
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా

చరణం 2
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్‌
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్‌
మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్‌

చరణం 3
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా
http://www.telugubiz.net/lyrics/missamma11.html


13.2.05

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి (2)
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న (2)
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువుసంధ్యలుండికూడ చవటలయ్యారు, వొట్టి చవటలయ్యారు (అనగనగా)

పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు
అయ్యో ఇంటిదీపమార్పివేయ నెంచెనొక్కడు
తల్లీతండ్రులు విషమని తలచెనొక్కడు (2)
పడుచుపెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడూ, భ్రమసెనొక్కడు (అనగనగా)


కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను (2)
కంటిపాప కంటె ఎంతొ గారవించెను (2)
దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగెను తానుండసాగెను (అనగనగా)

నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా (2)
కూరిమి గలవారంతా కొడుకులేనురా (2)
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా, కుక్క మేలురా (అనగనగా)

http://www.ghantasala.info/newlyrics/lyr336.html

9.2.05

ఆదిత్య 369

రాస లీల వేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయ నేలా
రాస లీల వేళ రాయబారమేల

కౌగిలింత వేడిలో కరిగె వన్నె వెన్నలా
తెల్లబోయె వేసవీ చల్లె పగటి వెన్నెలా
మోజులన్ని పాడగా జాజిపూల జావళీ
కందెనేమో కౌగిటా అందమైన జాబిలీ
తేనె వానలో చిలికె తీయనైన స్నేహము
మేని వీణ లోన పలికె సోయగాల రాగము
నిదుర రాని కుదురులేని ఎదలలోని సొదలు మాని ||రాస లీల వేళ||

మాయచేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని పాయి పూల జల్లులు
చేరదీసి చెంతకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువనీదు ||రాస లీల వేళ||

నవ్వే వాళ్ళు నవ్వనీ..

నవ్వే వాళ్ళు నవ్వనీ
ఏడ్చే వాళ్ళు ఏడ్వనీ
పొగిడే వాళ్ళు పొగడనీ
తిట్టే వాళ్ళు తిట్టనీ
don't care

పూలే నీపై చల్లనీ
రాళ్ళే నీపై రువ్వనీ
ఎత్తుకు నిన్నేగరెయ్యనీ
గోతులు నీకై తీయనీ
don't care... నవ్వే వాళ్ళు


అనుకొన్నది నీవ్వే చెయ్‌
అనుమానం మాని చెయ్‌
నీ మనసే గట్టి చెయ్‌
నీదే రా పై చెయ్‌ ॥నవ్వే వాళ్ళు ॥

ఎంత ఎదిగినా ఒదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో
క్రమశిక్షణ తో మెలగాలన్నది చీమను చూసి నేర్చుకో
చిరునవ్వుతో బ్రతకాలన్నది పువ్వును చూసి నేర్చుకో
ఓర్పు సహనం వుండాలన్నది పుడమిని చూసి నేర్చుకో
ఎంత తొక్కినా .. నిన్నెంత తొక్కినా ..
అంత పైకి రావాలన్నది బంతిని చూసి నేర్చుకో
నేర్చుకొన్నది పాటించేయి, ఓర్చుకొంటూ పనులే చేయి
నీదే రా పై చెయ్‌ ॥నవ్వే వాళ్ళు ॥

ఉన్నదున్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో
పరులకి సాయం చేయాలన్నది సూర్యుణ్ణి చూసి నేర్చుకో
సోమరితనాన్ని వదలాలన్నది గడియారాన్ని చూసి నేర్చుకో
ప్రేమనందరికి పంచాలన్నది భగవంతుణ్ణి చూసి నేర్చుకో
ఎంత చెప్పినా... నేనంత చెప్పినా
ఇంకెంతో మిగులున్నది అది నీకు నీవు తెలుసుకో
నేర్చుకొన్నది పాఠం చేయి నలుగురికీ అది నేర్పించేయి
నీదే రా పై చెయ్‌ ॥నవ్వే వాళ్ళు॥

రచన: చంద్రబోస్
చిత్రం: చెన్నకేశవ రెడ్డి
సహకారం: తెలుగుదనం @ yahoogroups.com

మొదటి పాట

తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతె వాళ్ళని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా

అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది
నాన్నా అన్న పదంలోన అభిమానం జనిస్తుంది
మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది...
మామ అన్న మాట మనసులోతుల్లో నిలుస్తుంది
అక్కా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది
ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది
పర భాషా జ్ఞానాన్ని సంపాదించు
కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతె వాళ్ళని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా
తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా
కొంత రుణం తీర్చరా

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతలు మార్చుకోవు
భూమి పైన ప్రాణులన్ని తమ భాషను మరువలేదు
మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము
ప్రపంచాన మేథావులు మన పలుకులు మెచ్చినారు
పొరుగురాష్ట్ర కవులు కూడ తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అది భాషాచారాలను మింగేయొద్దు

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా
వెనక్కి తగ్గమాకురా

తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం
మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా
అమ్మా నాన్నా అంటూ నేటినుండి పిలుద్దామురా
ప్రతిజ్ఞ పూనుదామురా..

రచన: చంద్రబోస్
చిత్రం: నీకు నేను నాకు నువ్వు
సహకారం: తెలుగుదనం at yahoogroups.com