18.2.05

రావోయి చందమామ..

పల్లవి
రావోయి చందమామ మా వింత గాద వినుమా
రావోయి చందమామ మా వింత గాద వినుమా
సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్‌
సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్‌
సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే

చరణం 1
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్‌
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్‌
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా

చరణం 2
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్‌
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్‌
మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్‌

చరణం 3
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా
http://www.telugubiz.net/lyrics/missamma11.html


13.2.05

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి (2)
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న (2)
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువుసంధ్యలుండికూడ చవటలయ్యారు, వొట్టి చవటలయ్యారు (అనగనగా)

పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు
అయ్యో ఇంటిదీపమార్పివేయ నెంచెనొక్కడు
తల్లీతండ్రులు విషమని తలచెనొక్కడు (2)
పడుచుపెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడూ, భ్రమసెనొక్కడు (అనగనగా)


కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను (2)
కంటిపాప కంటె ఎంతొ గారవించెను (2)
దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగెను తానుండసాగెను (అనగనగా)

నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా (2)
కూరిమి గలవారంతా కొడుకులేనురా (2)
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా, కుక్క మేలురా (అనగనగా)

http://www.ghantasala.info/newlyrics/lyr336.html

9.2.05

ఆదిత్య 369

రాస లీల వేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయ నేలా
రాస లీల వేళ రాయబారమేల

కౌగిలింత వేడిలో కరిగె వన్నె వెన్నలా
తెల్లబోయె వేసవీ చల్లె పగటి వెన్నెలా
మోజులన్ని పాడగా జాజిపూల జావళీ
కందెనేమో కౌగిటా అందమైన జాబిలీ
తేనె వానలో చిలికె తీయనైన స్నేహము
మేని వీణ లోన పలికె సోయగాల రాగము
నిదుర రాని కుదురులేని ఎదలలోని సొదలు మాని ||రాస లీల వేళ||

మాయచేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని పాయి పూల జల్లులు
చేరదీసి చెంతకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువనీదు ||రాస లీల వేళ||

నవ్వే వాళ్ళు నవ్వనీ..

నవ్వే వాళ్ళు నవ్వనీ
ఏడ్చే వాళ్ళు ఏడ్వనీ
పొగిడే వాళ్ళు పొగడనీ
తిట్టే వాళ్ళు తిట్టనీ
don't care

పూలే నీపై చల్లనీ
రాళ్ళే నీపై రువ్వనీ
ఎత్తుకు నిన్నేగరెయ్యనీ
గోతులు నీకై తీయనీ
don't care... నవ్వే వాళ్ళు


అనుకొన్నది నీవ్వే చెయ్‌
అనుమానం మాని చెయ్‌
నీ మనసే గట్టి చెయ్‌
నీదే రా పై చెయ్‌ ॥నవ్వే వాళ్ళు ॥

ఎంత ఎదిగినా ఒదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో
క్రమశిక్షణ తో మెలగాలన్నది చీమను చూసి నేర్చుకో
చిరునవ్వుతో బ్రతకాలన్నది పువ్వును చూసి నేర్చుకో
ఓర్పు సహనం వుండాలన్నది పుడమిని చూసి నేర్చుకో
ఎంత తొక్కినా .. నిన్నెంత తొక్కినా ..
అంత పైకి రావాలన్నది బంతిని చూసి నేర్చుకో
నేర్చుకొన్నది పాటించేయి, ఓర్చుకొంటూ పనులే చేయి
నీదే రా పై చెయ్‌ ॥నవ్వే వాళ్ళు ॥

ఉన్నదున్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో
పరులకి సాయం చేయాలన్నది సూర్యుణ్ణి చూసి నేర్చుకో
సోమరితనాన్ని వదలాలన్నది గడియారాన్ని చూసి నేర్చుకో
ప్రేమనందరికి పంచాలన్నది భగవంతుణ్ణి చూసి నేర్చుకో
ఎంత చెప్పినా... నేనంత చెప్పినా
ఇంకెంతో మిగులున్నది అది నీకు నీవు తెలుసుకో
నేర్చుకొన్నది పాఠం చేయి నలుగురికీ అది నేర్పించేయి
నీదే రా పై చెయ్‌ ॥నవ్వే వాళ్ళు॥

రచన: చంద్రబోస్
చిత్రం: చెన్నకేశవ రెడ్డి
సహకారం: తెలుగుదనం @ yahoogroups.com

మొదటి పాట

తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతె వాళ్ళని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా

అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది
నాన్నా అన్న పదంలోన అభిమానం జనిస్తుంది
మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది...
మామ అన్న మాట మనసులోతుల్లో నిలుస్తుంది
అక్కా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది
ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది
పర భాషా జ్ఞానాన్ని సంపాదించు
కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతె వాళ్ళని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా
తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా
కొంత రుణం తీర్చరా

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతలు మార్చుకోవు
భూమి పైన ప్రాణులన్ని తమ భాషను మరువలేదు
మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము
ప్రపంచాన మేథావులు మన పలుకులు మెచ్చినారు
పొరుగురాష్ట్ర కవులు కూడ తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అది భాషాచారాలను మింగేయొద్దు

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా
వెనక్కి తగ్గమాకురా

తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం
మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా
అమ్మా నాన్నా అంటూ నేటినుండి పిలుద్దామురా
ప్రతిజ్ఞ పూనుదామురా..

రచన: చంద్రబోస్
చిత్రం: నీకు నేను నాకు నువ్వు
సహకారం: తెలుగుదనం at yahoogroups.com