25.1.07

జన్మభూమి పిలుస్తోంది..

చంద్రబాబు నాయుడు మెదలు పెట్టిన జన్మభూమి కార్యక్రమం గుర్తున్నవాళ్ళందరికీ, ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి వాడిన ఈపాట కూడా గుర్తుండే ఉంటుంది.powered by ODEO

జన్మభూమి పాటను దిగుమతి చేసుకోండి

జన్మభూమి పిలుస్తోంది..నీ పుణ్యభూమి పిలుస్తోంది..
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

కన్నతల్లి కన్న మిన్న కదా నేలతల్లి
కన్నతల్లి కన్న మిన్న కదా నేలతల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి

వందేమాతరం వందేమాతరం వందేమాతరం

ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్షం చేయవు
ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు
ఏడాదికి ఏడాది నీకోసమె నువ్వు
ఏడాదికి ఏడాది నీకోసమె నువ్వు
అందులోంచి ఒక్కరోజు నీ ఊరికె ఇవ్వు
అందులోంచి ఒక్కరోజు నీ ఊరికె ఇవ్వు
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

చేతులెత్తి ధీనంగా నిలచున్నది ఎవరామె.
చిన్ననాడు మనల ఒడిలొ ఆడించిన గ్రామమే
పల్లెతల్లి కళ్ళనీళ్లు తుడిచే బాధ్యత నాది పల్లెతల్లి కళ్ళనీళ్లు తుడిచే బాధ్యత నాది
అనుకుంటే మనసుంటే ఊరువాడ మనది
అనుకుంటే మనసుంటే ఊరువాడ మనది
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

పది మైళ్ళు బడికి నడచి వెళ్లిన జ్ఞాపకముందా
వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా..
పాఠశాల, వైధ్యశాల కట్టమంది పల్లె
పాఠశాల, వైధ్యశాల కట్టమంది పల్లె
ఊతమివ్వు నువ్వు చేతికందిన కొడుకల్లె
ఊతమివ్వు నువ్వు చేతికందిన కొడుకల్లె
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

కడుపులొ పాతాళగంగలుబుకుతున్న బీడు, భగీరథుడివై రమ్మని పలుకుతుంది చూడు..
గండ్లుపడ్డ చెఱువు గుండె చెఱువై పడివుంది,

అడ్డుకట్టవేసి తనను ఆధరించమంది..
అడ్డుకట్టవేసి తనను ఆధరించమంది..
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

ఒకరికొకరు సహకరించుకోవడమే ఆశయం
ఒకరికొకరు సహకరించుకోవడమే ఆశయం
మనం మనల ఉధ్ధరించుకోవడమే ఉధ్యమం
మనం మనల ఉధ్ధరించుకోవడమే ఉధ్యమం
ఇదే జన్మభూమిని ఆరాధించే విధానం
ఇదే జన్మభూమిని ఆరాధించే విధానం
ఈ నూతన వత్సరాన ఇదే మరో ప్రస్థానం.