28.8.05

నేనున్నానని..

చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

తగిలే రాళ్ళని పునాది చేసి యదగాలని
తరిమే వాళ్ళని హితులుగ తలచి ముందుకెళ్ళాలని
కన్నుల నీటిని కలలు సాగుకై వాడుకోవాలని
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని
గుండేతో ధైర్యం చెప్పెను
చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని..

యెవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని
అందరు ఉన్నా ఆప్తుడు నువ్వై చేరువయ్యావని
జన్మకు యెరుగని అనురాగాన్ని పంచుతున్నావని
జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని
శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

Source: http://www.telugubiz.net/lyrics/nenunnaanu2.html

20.8.05

చెలికాడు నిన్నే రమ్మని పిలువా

చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
నన్నే తెలుపమంటావా
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా

నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ
నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
అహహా ...అహా ఒహోహో ....
అహహా ఒహో ......అ ఆ
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా

నీ అందమే శ్రీగంధమై నా డెందమలరించే
నీ రూపె దీపమ్మై ప్రియా నా చూపుల వెలిగించే
అహహా ... అహా ఒహోహో .....
అహహా ఒహో.......అ ఆ ...
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా

నీతోడుగా నడయాడగా ఇంకేమి కావాలీ
మధురానురాగాలే ఫలించే తరుణం రావాలీ
అహహా...అహా ఒహోహో....
హహా ఒహో...అ ఆ . .
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
నన్నే తెలుపమంటావా

Source: http://www.telugubiz.net/lyrics/kulagotralu3.html