17.9.06

అందమే ఆనందం

చిత్రం: బ్రతుకు తెరువు
గానం: ఘంటశాల


అందమే ఆనందం అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం

పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం
పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం
ఒడిలో, చెలి మోహనరాగం ఒడిలో, చెలి మోహనరాగం
జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం

అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం.
అందమే ఆనందం

పడిలేచే కడలితరంగం .. పడిలేచే కడలితరంగం
వడిలో జడిసిన సారంగం
పడిలేచే కడలితరంగం వడిలో జడిసిన సారంగం
సుడిగాలిలో .....సుడిగాలిలో ఎగిరే పతంగం.
జీవితమే ఒక నాటక రంగం జీవితమే ఒక నాటక రంగం

అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం

ఈ పాట సాహిత్యాన్ని నాకు అందజేసినవారు కృష్ణ వేదుల (జి మెయిల్: krishvedula)