17.9.06

రామ చక్కని సీతకీ

చిత్రం: గోదవరి
గానం: గాయత్రి
సంగీతం: కె.ఎమ్. రాధాకృష్ణ
సాహిత్యం: వెటూరి


నీల గగన, ఘనవి చలన, ధరణిజా శ్రీ రమణ
మధుర వదన, నళిన నయన, మనవి వినరా రామా!

రామ చక్కని సీతకీ, అరచేత గోరింత
ఇంత చక్కని చుక్కకీ ఇంకెవరు మొగుడంట?
రామ చక్కని సీతకీ..

పుడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే!
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే..
ఎత్త గలడా సీత జడను తాళి కట్టే వేళలో? రామ చక్కని సీతకీ..

ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేనని పెదవి చెప్పె, చెప్పలేమని కనులు చెప్పె
నల్లపూసై నాడు దేవుడు నల్లని రఘురాముడు. రామ చక్కని సీతకీ..

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచె
చూసుకోమని మనస్సు తెలిపే ..హమ్ .మ.మ. మనస్సు మాటలు కాదుగా
రామ చక్కని సీతకీ..రామ చక్కని సీతకీ, ఆర చేత గోరింత
ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట?
రామ చక్కని సీతకీ..

ఇందు వదన కుంద నదన మంద గమనా భామా!
ఇందు వదన ఇందు వదన ఇంత మదనా ..ప్రేమా!

ఈ పాట సాహిత్యాన్ని నాకు అందజేసినవారు కృష్ణ వేదుల (జి మెయిల్: krishvedula)

5 comments:

Sai Praveen said...
This comment has been removed by the author.
Sai Praveen said...

చిన్న సవరణండీ ..
ఆఖరి వాక్యం..

ఎందువలన ఇందువదనా ఇంత మధనం ..... ప్రేమా??

స్వామి ( కేశవ ) said...

maadi godavari jilla avatam vallnemo cinema ante naku chala istam. songs annee bavutay, "uppengene godavari" is my evergreen favourate song.., "inka andam ga lena" ee song aithe ammay manasentha sunnitham ga vuntumdo anipinchela vuntumdi., next ee song (cinema) lo kamalinee chala baga xpressions ichchindi kadandee..

Harilorvenz said...

ఎందువలన ఇందువదనా ఇంత మధనం ..... ప్రేమా??

మధనం కాదు మధనా ప్రేమ??

Harilorvenz said...

కుంద నదన కాదు కుందరదన