28.8.05

నేనున్నానని..

చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

తగిలే రాళ్ళని పునాది చేసి యదగాలని
తరిమే వాళ్ళని హితులుగ తలచి ముందుకెళ్ళాలని
కన్నుల నీటిని కలలు సాగుకై వాడుకోవాలని
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని
గుండేతో ధైర్యం చెప్పెను
చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని..

యెవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని
అందరు ఉన్నా ఆప్తుడు నువ్వై చేరువయ్యావని
జన్మకు యెరుగని అనురాగాన్ని పంచుతున్నావని
జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని
శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

Source: http://www.telugubiz.net/lyrics/nenunnaanu2.html

10 comments:

Anonymous said...

Hi Ramana,
Nice work in Telugu. Can you guide me how to post telugu on blogs. I mean how did you do that? It is pretty cool.

-Venkat

Anonymous said...

Curious to know abt it.

Anonymous said...

Hello Ramana gaaru,
mee selection of songs chaala baagundhi. meeku nachina ee paaTa ke nandi award vachindhi :)

keep blogging

~ chaitanya

Anonymous said...

ide movie lo naaku nachina maroka paaTa kuda undhi... "Ee swasa lo cherete"
i love the lyric of that song. hope u like it

~ chaitanya

వెంకట రమణ said...

Hello venkat,
Please see the post by chavakiran in the telugublog google group in this thread on how to write in telugu. Hope to see your telugu blog soon.

-ramana

వెంకట రమణ said...

చైతన్య గారు,
మీరు చెప్పిన పాట నాకు కూడ ఇష్టమే త్వరలొనే పోష్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తాను.

Anonymous said...

వెంకట రమణ గారు,
నా దగ్గర యునీకోడ్ తెలుగులో రాసిన పాటలు కొన్ని ఉన్నయి. నేను వాటిని పోస్ట్ చెయ్యలేదు. మీరు చెస్తాను అంటే, మీకు వాటిని పంపిస్తాను. ఎ విషయం నాకు జాబు రాయండి. (krishvedula@gmail.com)

ఇట్లు,
కృష్ణ

bangaru raju said...

Ramana garu,

mee prayathnam chaalaa santhoshanni kaligisthundi. GAMYAM cinema lo ENTHA VARAKU, DENI KORAKU pata vrayaroo!

mee
BANGARU RAJU,
SRISAILAM PROJECT

Anonymous said...

నమస్తే రమణ గారు,

మీ బ్లాగ్ చాలా బాగుంది.
తెలుగు సినిమాలలోని మంచి పాటలను అందిస్తున్నదుకు ధన్యవాదాలు.
నేను చాల రొజులనుంచి వెతుకుతున్న
పలనాటి యుద్ధం (1966, NTR, Bhanumati starring) చిత్రం లో ని మొదటి పాట సాహిత్యం దయచేసి
రాయగలరు...


'శాతవాహన తెలుగు చక్రవర్తుల.......'
please please please.

if not possible please send the audio song to my id....


my id is: tchaitanyat@gmail.com
chaitanya.

blog said...

so nice your work .....