25.1.07

జన్మభూమి పిలుస్తోంది..

చంద్రబాబు నాయుడు మెదలు పెట్టిన జన్మభూమి కార్యక్రమం గుర్తున్నవాళ్ళందరికీ, ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి వాడిన ఈపాట కూడా గుర్తుండే ఉంటుంది.

powered by ODEO

జన్మభూమి పాటను దిగుమతి చేసుకోండి

జన్మభూమి పిలుస్తోంది..నీ పుణ్యభూమి పిలుస్తోంది..
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..
కన్నతల్లి కన్న మిన్న కదా నేలతల్లి
కన్నతల్లి కన్న మిన్న కదా నేలతల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
వందేమాతరం వందేమాతరం వందేమాతరం
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్షం చేయవు
ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు
ఏడాదికి ఏడాది నీకోసమె నువ్వు
ఏడాదికి ఏడాది నీకోసమె నువ్వు
అందులోంచి ఒక్కరోజు నీ ఊరికె ఇవ్వు
అందులోంచి ఒక్కరోజు నీ ఊరికె ఇవ్వు
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

చేతులెత్తి ధీనంగా నిలచున్నది ఎవరామె.
చిన్ననాడు మనల ఒడిలొ ఆడించిన గ్రామమే
పల్లెతల్లి కళ్ళనీళ్లు తుడిచే బాధ్యత నాది పల్లెతల్లి కళ్ళనీళ్లు తుడిచే బాధ్యత నాది
అనుకుంటే మనసుంటే ఊరువాడ మనది
అనుకుంటే మనసుంటే ఊరువాడ మనది
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

పది మైళ్ళు బడికి నడచి వెళ్లిన జ్ఞాపకముందా
వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా..
పాఠశాల, వైధ్యశాల కట్టమంది పల్లె
పాఠశాల, వైధ్యశాల కట్టమంది పల్లె
ఊతమివ్వు నువ్వు చేతికందిన కొడుకల్లె
ఊతమివ్వు నువ్వు చేతికందిన కొడుకల్లె
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

కడుపులొ పాతాళగంగలుబుకుతున్న బీడు, భగీరథుడివై రమ్మని పలుకుతుంది చూడు..
గండ్లుపడ్డ చెఱువు గుండె చెఱువై పడివుంది,
గండ్లుపడ్డ చెఱువు గుండె చెఱువై పడివుంది,
అడ్డుకట్టవేసి తనను ఆధరించమంది..
అడ్డుకట్టవేసి తనను ఆధరించమంది..
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

ఒకరికొకరు సహకరించుకోవడమే ఆశయం
ఒకరికొకరు సహకరించుకోవడమే ఆశయం
మనం మనల ఉధ్ధరించుకోవడమే ఉధ్యమం
మనం మనల ఉధ్ధరించుకోవడమే ఉధ్యమం
ఇదే జన్మభూమిని ఆరాధించే విధానం
ఇదే జన్మభూమిని ఆరాధించే విధానం
ఈ నూతన వత్సరాన ఇదే మరో ప్రస్థానం.
ఈ నూతన వత్సరాన ఇదే మరో ప్రస్థానం.

తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..
కన్నతల్లి కన్న మిన్న కదా నేలతల్లి
కన్నతల్లి కన్న మిన్న కదా నేలతల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
కదులుదాము తెలుగుతల్లి కాళ్ళకు ప్రణమిల్లి
వందేమాతరం వందేమాతరం వందేమాతరం
తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..

11 comments:

Anonymous said...

ఒక మంచి పాట అందించారు.

Srujana said...

Venkata ramana gaaru
Konni paatalu marikonni matalu enduko manavi mavi annattu anipisthu untayi...
atuvanti vatilo ee janmabhumi pata okati...
Ma amma govt school lo head mistress ga chese varu..appudu govt school vallandiriki ee casetes ivvatam jarigindi..
nenu eppudu ee pata vintu undedanni...
ippudu mee blog lo ee pata chusaka...
malli okkkasari aa gnapakalu nemaravesukunnanu..
Gud post..
keep going

Mitra said...

నమస్తే మీకు ఎప్పుడైనా ఒక తెలిసిన పాట పదాలు గుర్తుకు రాక నానా హైరానా పడ్డ స్థితి వచ్చే వుంటుంది.
ఇదో ఇప్పుడు నాకు ఒక గద్దర్ పాట గుర్తుకు రాక నిద్ర పట్టటం లేదు.
వరకట్నం పై ఏడొ పాట - 1స్ట్ పంక్తి గుర్తుకు రావడం లేదు.
2న్డ్ పంక్తి విరిసీ విరియని ఓ చిరునవ్వా అని గుర్తు.
ఎవరైనా హెల్ప్ చేయరూ?

Mitra said...

I was posting this request to teugu blogs in general. please help me if you could good blogger.
Thanks.

వెంకట రమణ said...

నాకు ఆపాట గద్దర్ వ్రాశారని తెలియదుగాని, పాట విన్నట్టు గుర్తు. దానిలో మెదటి పంక్తి "కర్మభూమిలో పుట్టిన ఓ పువ్వా" అనుకుంటాను.

మీ సందేహాలను తెలుగు బ్లాగు గూగులు గుంపు(http://groups.google.com/group/telugublog)లో అడిగితే సరైన సమాధానాలు రాబట్టుకోవచ్చు.

Anurup said...

మీ బ్లాగు చాల బాగుంది. సత్ ప్రయత్నం. తెలుగు పాటల మాటలను తెవికిలోకి ఎక్కించే ప్రాజెక్టు మొదలు పెట్టబోయార? అప్పుడు ఎక్కువ మంది పాలుకొంటారు.

iwwh said...

very good song-iwwh.blogspot.com

Madhu Latha said...

Follow us పెడితే నేను మిమ్మలని ఫొల్లౌ అవ్వవచ్చు మీరు కొత్త ఠపా వ్రాసినప్పుడల్లా నాకు తెలుస్తుంది.

www.teluguvaramandi.net

Abhi said...

AbhiLyrics.com is the 1 stop solution for all Latest Movie Lyrics Telugu, Hindi And Tamil.https://abhilyrics.com/

ChalisaLyricsPDF said...

Thnx for sharing hanuman chalisa lyrics in Telegu

Siri said...

Good song..