16.9.06

కుషీ కుషీగా నవ్వుతు

చిత్రం: ఇద్దరు మిత్రులు
గానం: ఘంటసాల, సుశీల

కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేవెందుకే నిషా కనుల దాన

కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేవెందుకే నిషా కనుల దాన

మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలి మీనా
మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలి మీనా
నింగిదాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన

కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేదిందుకే నిషా కనుల వాడ

ఒహో చెలియా నీవుకుడా ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
ఒహో చెలియా నీవుకుడా ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
హాయికొలుపు సన్నాయి పాటలో వలపుబాటలే వేసుకో

నే వెళితే మరి నీవు, మజ్నువవుతావూ
నే వెళితే మరి నీవు, మజ్నువవుతావూ

మజ్ను నేనైతే ఓ లైలా లోకమే చీకటై పోవునే
మజ్ను నేనైతే ఓ లైలా లోకమే చీకటై పోవునే

కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగా వుందాములే నిషా కనుల వాడ

ఆకాశంలో ఇంద్రధనస్సుపై ఆడుకుందమా నేడే
నీలి నీలి మేఘాల రధముపై తేలిపోదామీనాడే

చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలసిపోదమా హాయిగా
నేను వీణనై నీవు నాదమై ఏకమౌదమా తీయగా

కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగా వుందాములే హమేషా మజాగా


ఈ పాట సాహిత్యాన్ని నాకు అందజేసినవారు కృష్ణ వేదుల (జి మెయిల్: krishvedula)

2 comments:

శిశిర said...

మీ ప్రయత్నం చాలా బాగుందండి. కాని ఒక సూచన. నాకు తెలిసి కుషీ కుషీ కాదండి. ఖుషీ ఖుషీ అనుకుంటున్నాను. నా సూచన సరైనదనిపిస్తే దయచేసి ఆ పదాలను మార్చగలరు. నా ఈ సూచన మీకేమైనా ఇబ్బంది కలిగిస్తే క్షమించగలరు.

కొల్లూరి భాస్కర రావు said...

Lasya is correct